ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో

0

టిక్ టాక్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసింది. సరదాగా ఓ నాటు తుపాకీతో టిక్ టాక్ వీడియో చేయడానికి ప్రయత్నించి ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో చోటుచేసుకుంది..

అహ్మద్ నగర్ జిల్లాలో 17 ఏళ్ల బాలుడు ప్రాతిక్ వాదేకర్ ఓ నాటు తుపాకీతో టిక్ టాక్ వీడియో చేద్దామని ఓ హోటల్ రూముకు చేరుకున్నారు. ఈ నాటుతుపాకీని బంధువుల నుంచి కొన్న బాలుడు దానితో హీరోలాగా టిక్ టాక్ వీడియో తీద్దామనుకున్నాడు. అయితే తలకు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండగా ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో బుల్లెట్లు తలలోకి దూసుకుపోయి అక్కడికక్కడే మరణించాడు.

తన కజిన్స్ తో కలిసి ఈ వీడియో తీద్దామని రూముకు వెళ్లిన ప్రాతిక్ ఇలా హఠాత్తుగా చనిపోవడంతో అతడి సోదురు రూమ్ నుంచి భయంతో పారిపోయారు. ఇక తుపాకీ శబ్ధం రావడంతో హోటల్ సిబ్బంది వెళ్లి చూసేసేసరికి రక్తపు మడుగులో బాలుడు పడి ఉన్నారు.

కాగా బాలుడికి తుపాకీని అమ్మిన ఆయన బంధువులు సన్నీ పవర్ నితిన్ వాదేకర్ లపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు షిరిడీ ఇన్ స్పెక్టర్ అనిల్ కట్కే తెలిపాడు.