2020’లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే..

0

2020కి సంబంధించిన సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను గురువారం (నవంబరు 21) విడుదల చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ ఈ సెలవుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం 2020లో 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో నాలుగు ఆదివారాలు, ఆరు శనివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. రిపబ్లిక్ డే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి ఆదివారం రాగా.. దీపావళి పండుగా రెండో శనివారం వచ్చింది. ఇక ముఖ్యమైన పండుగలకు సంబంధించి.. జనవరి 15న సంక్రాంతి, ఫిబ్రవరి 21న శివరాత్రి, మార్చి 23న ఉగాది, బోనాలు జులై 20న, దుర్గాష్టమి అక్టోబరు 24న వచ్చాయి.
Please Read Disclaimer