బిగ్ బాస్ 3 ఓట్లు గుద్దడం ఎలా?

0

బిగ్ బాస్ సీజన్ 3 గత ఆదివారం ప్రారంభమైంది. తొలివారంలోనే ఎలిమినేషన్‌ ప్రక్రియ షురూ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్‌లో ఆరుగురు ఎలిమినేషన్‌ని నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌‌ని నామినేట్ అయిన వారిలో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండగా.. వీరిలో ఉండేవి ఎవరు? వెళ్లేది ఎవరో నిర్ణయించేది ప్రేక్షకుల ఓటింగ్. ఇంతకీ ఓటింగ్ ఎలా చేయాలి? తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు ఎన్ని ఓట్లు వరకూ వేయొచ్చు.. తదితర విషయాలు మీకోసం..

గతంలో ‘గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌’ ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. అయితే, ఈసారి ఎలిమినేషన్‌‌కి చేపట్టే ఓటింగ్‌ ప్రక్రియను మార్చేశారు. ఇందులో ఒకటి హాట్ స్టార్ ద్వారా ఓటింట్ చేయడం.. రెండోది ఫోన్ కాల్.

హాట్ స్టార్ ఓటింగ్ ఇలా.. 
ప్లే స్టోర్‌లోకి వెళ్లి హాట్ స్టార్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అనంతరం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోగానే.. తెలుగుకి సంబంధించి హాట్ స్టార్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల లిస్ట్ వస్తుంది. అందులో బిగ్ బాస్‌ను సెలెక్ట్ చేసుకోగానే.. అందులో లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్లే అవుతుంది. ఆ కిందనే గ్రీన్ కలర్‌‌తో VOTE అని రాసి ఉంటుంది. VOTEని క్లిక్ చేయగానే.. లాగిన్ ఎంటర్ చేయమని వస్తుంది. ఈ లాగిన్ ఫేస్ బుక్ లేదా మొబైన్ నంబర్ నుండి లాగిన్ కావొచ్చు.

లాగిన్ అయిన తరువాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఒక వేళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. సంబంధిత నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓ టీ పీ నంబర్‌ని ఎంటర్ చేసి.. పేరు, ఏజ్ మిగిలిన వివరాలు ఇచ్చి ఓకే చేయగాని కొత్తగా అకౌంట్ క్రియేట్ అవుతుంది. (ఒకవేళ మీరు ఇప్పటికే హాట్ స్టార్‌ యాప్‌ని ఉపయోగిస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఓట్ చేయవచ్చు)

అలా క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వారం ఎవరైతే ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారో వాళ్ళ ఫొటోలు కనిపిస్తాయి. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కు 10 ఓట్లను ఇవ్వొచ్చు. అలా కాకుండా ఈ పది ఓట్లను మనకు నచ్చినట్టుగా కూడా షేర్ చేయవచ్చు.

ఉదాహరణకు ప్రస్తుతం ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితిక, హిమజ, జాఫర్, హేమలు ఉన్నారు కాబట్టి.. వాళ్లు ఫొటోపై ఒక్కసారి క్లిక్ చేసి ఒక్క ఓటు పడుతుంది. రెండు సార్లు క్లిక్ చేస్తే రెండు ఓట్లు పడతాయి. ఓట్లను తమకు నచ్చినట్టు ఓట్లు డివైడ్ చేసుకోవచ్చు. ఇలా రోజుకు ఒకసారి 10 ఓట్లును వేయవచ్చు.

ఇలా కాకుండా… డైరెక్ట్‌గా ఫోన్ చేసి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది.




Please Read Disclaimer