కోవిడ్ – 19 సృష్టించింది కాదట

0

ప్రపంచం మొత్తం ఇప్పుడు కోవిడ్ ` 19 అదేనండి కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోని వందలాది దేశాలు ప్రస్తుతం ఈ వైరస్ వల్ల గజగజ వణికి పోతున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ ను కనిపెట్టక పోవడం వల్ల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపుగా 150 దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ సమయంలో కరోనా వైరస్ ను కావాలని చైనా వారు పుట్టించారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

అమెరికన్స్ పై ప్రయోగించేందుకు చైనా వారు దీన్ని తయారు చేశారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో పలు పరిశోదనలు.. ప్రయోగాలు చేసిన తర్వాత అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారు కరోనా వైరస్ అనేది సహజ సిద్దంగా పుట్టిందని నిర్ధారించారు. ఈ వైరస్ ను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదని.. ఇది గబ్బిలం నుండి మనుషులకు రావడంతో ఇప్పుడు మనుషులు ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప ప్రత్యేకంగా దీన్ని తయారు చేయడం జరగలేదని వారు క్లారిటీ ఇచ్చారు.

కరోనా వైరస్ మూలభాగం ఇప్పటి వరకు గుర్తించిన వైరస్ ల మూల భాగం కంటే చాలా విభిన్నంగా ఉందని అందుకే ఈ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయడం ఆలస్యం అవుతుందని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైరస్ మానవ సృష్టి అంటూ వచ్చిన పుకార్లకు శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ ప్రచారం ఆగిపోనుంది. జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ రాకుండా చూసుకోవచ్చు.. అలాగే కరోనా వైరస్ వచ్చినా కూడా సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాలతో భయటపడవచ్చు అంటూ వైధ్యులు ఇంకా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-