సుఖం వెనుక విషాధం.. విటున్ని కదిలించిన వేశ్యకథ

0

వ్యభిచారం నేరం.. దేశంలో నిషేధం.. ఆ పని చేస్తే అరెస్ట్ చేస్తారు.. లోపలేస్తారు. చేసిన స్త్రీని.. వచ్చిన విటుడికి శిక్షలు విధిస్తారు. అయితే ఇదంతా ఇష్టంగా చేస్తే.. మరి కొన్ని వ్యభిచార ముఠాలు బలవంతంగా చేయిస్తే.. ఇష్టం లేకున్నా మహిళలను క్షోభపెడితే ఎలా.? ఇష్టం లేకున్నా ఆ రొంపిలోకి దిగి అష్టకష్టాలు పడుతున్న మహిళలకు దిక్కెవరు?

సుఖం కోసం వెళ్లే పురుషుడు దాని కోసమే పరితపిస్తాడు.. పని చూసుకొని వస్తాడు. ఈ వ్యక్తి కూడా అంతే అనుకొని వెళ్లాడు.. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. సుఖాన్ని కాదు.. ఆ మహిళ కష్టాన్ని తెలుసుకున్నాడు.. తన ప్రాంతమే అయిన ఆమె కష్టాలకు చెలించి విముక్తి కల్పించాడు. సుఖం కోసం వెళ్లి ఒక మహిళను ఆ రొంపిలోంచి బయటకు తీసుకొచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఈ యధార్థ ఘటన ఆసక్తి రేపుతోంది.

కోల్ కతా కు చెందిన 27 ఏళ్ల మహిళ అక్కడే ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుండేది. కానీ ఇంట్లో ఖర్చులకు జీతం సరిపోక మంచి ఉద్యోగం కోసం వెతుకుతూ ఓ మయలేడి దృష్టిలో పడింది. ఆమె ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. జూన్8న ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార ముఠాలకు అమ్మేసింది. వ్యభిచార ముఠాలు బాధిత మహిళ దగ్గర డబ్బులు – సెల్ ఫోన్ లాక్కొని వ్యభిచారం చేయాలంటూ చిత్రహింసలు పెట్టారు.నరకం చూపించారు. దీంతో చేసేదేం లేక ఆ కూపంలోకి దిగిపోయింది.

అయితే కోల్ కతా కే చెందిన ఓ వ్యక్తి విటుడిగా సుఖం కోసం ఈమె దగ్గరకే వచ్చాడు. బెంగాలీ కావడం.. బెంగాలీలో మాట్లాడడంతో ఈమె కష్టాలను చెప్పుకుంది. సావధానంగా విన్న వ్యక్తి మహిళ కష్టాలకు చలించిపోయాడు. ఆమె అడ్రస్ – సోదరుడి ఫోన్ నంబర్ తీసుకొని సమాచారం అందించాడు. సోదరుడు వచ్చి విటుడిగా ఆ వ్యభిచార గృహానికి వెళ్లి తన అక్కే అక్కడ ఉందని నిర్ణారించుకున్నాడు. బయటకు వచ్చి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. వారి ఆదేశాల మేరకు పోలీసులు వచ్చి వ్యభిచార ముఠా ఆటకట్టించి ఆ మహిళను విడిపించారు.

ఇలా సుఖాన్ని వెతుక్కుంటూ వచ్చిన విటుడు ఆమె పాలిట వరంగా మారాడు. వ్యభిచార కూపం నుంచి సదురు మహిళను విడిపించి పునర్జన్మనిచ్చాడు. ఈ విషాదకర వాస్తవం ఆమె జీవితంలో వెలుగులు నింపింది.
Please Read Disclaimer