కేసీఆర్ బాల్య వివాహం చేసుకున్నారట

0

మేధావిగా అందరూ అనుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని సీఎం కేసీఆరే స్వయంగా చెప్పకొచ్చారు. వేలాది పుస్తకాల్ని చదివి.. దాని సారాన్ని తన బుర్రలో పెట్టేసుకొని.. ఏ విషయం మీదనైనా సాధికారికతతో మాట్లాడే కేసీఆర్ లాంటి అపూర్వ మేధావి.. పెళ్లి బాల్య వివాహమన్న విషయాన్ని వెల్లడించారు.

తమది బాల్య వివాహమని.. తన పద్నాలుగేళ్ల వయసులోనే వరంగల్ జిల్లా చిత్తలూరులో తన వివాహం జరిగినట్లు చెప్పారు. చిన్నతనం నుంచి తాను వైష్ణవ సంప్రదాయంలోనే పెరిగానని.. అప్పటి నుంచే తనలో భక్తి పెరిగి.. అదిప్పటివరకూ కొనసాగుతూనే ఉందన్నారు. గురువులు నేర్పిన సంస్కారమే తనను ఇంతవాడ్ని చేసిందన్నారన్నారు.

మిగిలిన సంగతులు సరే.. చిన్నప్పుడు భారతం.. భాగవతం లాంటి వాటిని వినే అలవాటున్న కేసీఆర్.. అంత చిన్నతనంలోనే బాల్య వివాహాన్ని ఎలా చేసుకోగలిగారు? మేధావితనం అన్నది పుట్టుకతోనే వస్తుందే తప్పించి.. నలభై ఏళ్లకో.. యాభై ఏళ్ల వయసులో రాదు కదా? మరి.. అలాంటప్పుడు కేసీఆర్ బాల్యవివాహాన్ని ఎందుకు చేసుకున్నట్లు..?
Please Read Disclaimer