ఆమెని కాపాడాలని చూసారో మీకు అదే గతి .. హెచ్చరించిన ఏసీబీ

0

ప్రభుత్వ అధికారుల కి ఈ సమాజం లో ఒక గౌరవం ఉంది. కానీ కొంత మంది చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల కే చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ..లంచం లేనిదే మంచం దిగరు అనే స్థాయికి వచ్చేసింది. ఎదో అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసుల కి వచ్చిన వారు లంచం ఇస్తే కానీ మీ పని కాదు అని కొంత మంది నిర్మొహ మాటంగా చెప్పేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ప్రభుత్వ ఉద్యోగులు ఎలా మారిపోయారు. ఆలా అని అందరూ లంచం తీసుకుంటున్నారు అని అనడంలేదు.

లక్షణమైన జీతం ..సమాజం లో గౌరవం ..ఇన్ని ఉన్నా కూడా లంచానికి అలవాటు పడి కటకటాల పాలైన వారు చాలామంది ఉన్నారు. వారిని చూసైనా బుద్దితెచ్చుకోవాల్సిన అధికారులు ..మళ్ళీ అదే తప్పు చేసి జైలు కి వెళ్ళడాని కి సిద్ద పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీ కి అడ్డంగా దొరికింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం కాగా.. ఆ విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.

పూర్తి వివరాలు చూస్తే … గూడురుకు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం నెల రోజుల క్రితం తహశీల్దార్ హసీనా బీ ని ఆమె కార్యాలయంలో సంప్రదించాడు. దీనితో ఆమె రూ.8లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.4లక్షలకు ఇవ్వడాని కి ఒప్పుకున్నాడు. ఆ డబ్బుని తీసుకునేందుకు మధ్య వర్తిని పంపింది. అదే సమయం లో ఏసీబీ అధికారులు దాడులు చేయ గా సురేష్ నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న మధ్య వర్తి మహబూబ్ బాషా ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనా బీ అప్పటి నుంచి పరారీలో ఉంది. ఇక మహబూబ్ భాషా ను శనివారం కోర్టు లో హాజరు పరచ గా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ కేసు లో హసీనాబీ ముద్దాయిగా ఉన్నారని ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు హసీనా బీ ఆచూకీ కోసం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యం లో పలు బృందాలు ముమ్మరం గా గాలింపు చర్యలను చేపడుతున్నాయి.
Please Read Disclaimer