రఘురామకృష్ణం రాజుకి వైసీపీ అందుకే నచ్చలేదా?

0

సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు రఘురామకృష్ణం రాజుకి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం రాలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత ఆ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో రాష్ట్రమంతా జగన్ గాలి వీచింది. అంత వైసీపీ వేవ్ లోనూ నర్సాపురంలో మాత్రం రఘురామకృష్ణం రాజు బోటా బోటీ మెజారితోనే గెలిచాడు.

అంతవరకు బాగానే ఉన్న వైఎస్ జగన్ మొదట్లో రఘురామకృష్ణం రాజుకి మంచి గౌరవం ఇచ్చాడు అని వైసీపీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ రఘురామకృష్ణం రాజు ఎంపీ పదవిని అడ్డుపెట్టుకొని బీజేపీ వాళ్లతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లాడని.. అలా వద్దని వైసీపీ పెద్దలు వారించినా వినిపించుకోలేదని సమాచారం. వైసీపీ ప్రోటోకాల్ పాటించాలని వైసీపీ పార్టీ అందరూ ఎంపీలకు సూచించినా రఘురామ మాత్రం పెడచెవిన పెట్టాడని అంటారు.

ఒక రోజు మోడీ పార్లమెంట్ లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ‘వాట్ మిస్టర్ రాజు గారు.. హౌ ఆర్ యూ’ అని అనేసరికి ఆ వీడియో బాగా వైరల్ చేశారు తెలుగు మీడియా వాళ్లు. అప్పటి నుంచి డైరెక్టుగా రఘురామకృష్ణం రాజుకి నేరుగా బీజేపీ వాళ్లకు టచ్ లోకి వెళ్లాడు రఘురామకృష్ణం రాజు. ఆ తరువాత ఎంపీల అందిరికీ పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీకి బీజేపీ ఎంపీలు ఎక్కువమంది వచ్చారు అని నాకు ఢిల్లీలో విపరీతంగా ఫాలోయింగ్ ఉందని ఊహించుకొని వైసీపీతో అంటీ ముట్టనట్టు ఉండడం మొదలుపెట్టాడట.. ఈ క్రమంలోనే టీడీపీ అనుకూల మీడియాలకు టచ్ లోకి వెళ్లాడంట..

దీనిపై వైసీపీ హైకమాండ్ లో ఉన్న కొందరు పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని సూచించారట.. అయితే రఘురామ మాత్రం ‘మీరు అంతా ఒకసారి వెనక్కు వెళ్లి గుర్తు తెచ్చుకోండి.. నేను వైఎస్ఆర్ తో డిన్నర్ చేసేటప్పుడు మీరు అంతా డోర్ దగ్గర ఉండేవాళ్లు.. ఇప్పుడు నాకు మీరు చెప్పే వాళ్లా?’ అని అన్నాడు అని వైసీపీలో ఒక వర్గం వాదిస్తోంది..

బీజేపీలో ఎలాగూ సేఫ్ గా ఉంటుంది. నెక్ట్స్ జనసేన బీజేపీ పొత్తు కాబట్టి నర్సాపురం సీటు వాళ్ల కాంబినేషన్ లో సేఫ్ కాబట్టి రఘురామకృష్ణం రాజు ఎవరిని లెక్క చేయడం లేదు అని మీడియా సర్కిల్స్ లో అనుకుంటున్నారు.
Please Read Disclaimer