నిర్భయ కేసులో..ఈ షాక్ ఊహించనిది!

0

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులకు సంబంధించిన ఉరి తీత ప్రక్రియలో ఊహించని సమస్య ఎదురైంది. మరణశిక్ష విధించే ముందే దోషులకు క్షమాభిక్ష వేడుకునే అవకాశం ఉండటం…దాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించే అవకాశాలనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. తీహార్ జైలు అధికారులు నలుగురు దోషులకు మరికొన్ని రోజుల్లోనే వారికి మరణశిక్షను అమలుచేయనున్నారు. న్యాయపరమైన అంశాలన్నీ పూర్తి అయినప్పటికీ… తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంతో ఈ దుర్మార్గులు మరికొన్ని రోజులు జీవించి ఉండే అవకాశం కనిపిస్తోంది.

2012 డిసెంబర్ 6 న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మెడిసిన్ విద్యార్థినిపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. మరోకరు మైనర్ అయినందున జువైనల్ కస్టడీలో ఉన్నారు. దీనిపై విచారణ అనంతరం ట్రయల్ కోర్టువారికి మరణశిక్షను విధించింది. దీనిని ఢిల్లీ హైకోర్టు – సుప్రీంకోర్టు కూడా స్పమర్థించాయి. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ.. ముగ్గురు దోషులు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో శిక్షను అమలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిర్భయ కేసులో ఇతర దోషులైన ముఖేష్ – పవన్ – అక్షయ్ – వినయ్ శర్మకు సంబంధించిన న్యాయపరమైన కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుకునే అవకాశం ఒక్కటి మిగిలి ఉంది. అయితే నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. లేఖ లో విజ్ఞప్తి చేశారు. దీంతో క్షమాభిక్ష పట్ల ఆయన సానుకూలంగా వ్యవహరించకపోవచ్చునని అంటున్నారు.

ఇలా న్యాయ చట్ట పరంగా ప్రక్రియలన్నీ పూర్తవడం – క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించే అవకాశాలు ఉండటం – అనంతరం కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీతో త్వరలోనే మరణ శిక్ష అమలు కానుండగా… ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా?ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన జైలు తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. ఉరి తీసే తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer