‘భవిష్యత్తు నుంచి వచ్చా.. నా గర్భంలో ఏలియన్ పెరుగుతోంది, ఇదిగో ఆధారం’

0

‘ఆదిత్య 369’ సినిమాలో టైమ్ మిషిన్ ద్వారా భవిష్యత్తుకు, గతానికి వెళ్తుంటారు. సూర్య నటించిన ‘24’ సినిమాలో కూడా ఒక కాలం నుంచి మరో కాలానికి ప్రయాణం చేయడాన్ని చూపించారు. అలా కాలంలో ప్రయాణం చేసేవారిని ‘టైమ్ ట్రావెలర్స్’ అంటారు. అయితే, వారు నిజంగా ఉన్నారా? అది సాధ్యమేనా? అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో కొంతమంది ‘టైమ్ ట్రావెలర్స్’ పేరుతో ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు. 

ఇటీవల ఓ మహిళ.. తాను కూడా టైమ్ ట్రావెలర్ అంటూ ముందుకొచ్చింది. ఆమె చెబుతున్న విషయాలు వింటే షాకవ్వడం ఖాయం! భవిష్యత్తుకు వెళ్లి వచ్చిన తాను ఏలియన్ (గ్రహాంతరవాసి) వల్ల గర్భవతిని అయ్యానని చెబుతోంది. అంతేకాదు, తన కడుపులో ఏలియన్ బిడ్డ పెరుగుతోందని తెలుపుతోంది. ఈ సందర్భంగా అల్ట్రా సౌండ్ రిపోర్టును కూడా చూపిస్తోంది. 

అలా మొదలైంది: ‘‘నాకు 18 ఏళ్లు. నేను పారీస్‌లోని ఓ యునివర్శిటీలో చదువుతున్నా. ప్రొఫెసర్ పాల్ మార్టెక్స్ నాకు ల్యాబ్‌లో ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ నేను రెండేళ్ల నుంచి పనిచేస్తున్నా. అక్కడ చాలా తక్కువ మంది పనిచేస్తుంటారు. ఆ ల్యాబ్‌లో చాలా గదులు ఉన్నాయి. వాటిలో ఓ గది ఎప్పుడు మూసి ఉంటుంది. అందులో ఏముందో తెలుసుకోవాలని ఒక రోజు పాల్ మార్టెక్స్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ కార్డును దొంగిలించాను. దాని సాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే అన్నీ వైర్లే కనిపించాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల శబ్దాలు వినిపించేవి. అయితే, నేను ఆ గదిలో ఉన్నట్లు కనిపెట్టేశారు. నన్ను మందలిస్తారని అనుకున్నా. కానీ, అతను చేపడుతున్న టైమ్ మెషిన్ ఆపరేటర్‌గా జాయిన్ చేసుకున్నాడు’’ అని వీడియోలో తెలిపింది. 

3500 సంవత్సరంలో ఏం జరిగిందంటే..: ‘‘ఎలక్ట్రిసిటీ, రేడియో వేవ్స్ ద్వారా  టైమ్ మెషిన్ పనిచేస్తుంది. దీని ప్రయోగంలో భాగంగా 2900 సంవత్సరానికి వెళ్లి వచ్చాను. అది చాలా పచ్చగా అందంగా ఉంది. ఈ నేపథ్యంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ సారి 3500 సంవత్సరానికి వెళ్లేలా టైమ్ సెట్ చేశాం. 14 మంది మిలటరీ సర్వెంట్లతో మొత్తం 20 మంది ఆ కాలానికి వెళ్లాం. ఆ సమయంలో ఆండ్రోమెడ గాలక్సీ నుంచి వచ్చిన ఏలియన్లకు, మనుషుల మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది. భవనాలు కూలిపోయి ఆ ప్రాంతమంతా బూడిదలా కనిపించింది. ఆ ఏలియన్లు మనుషుల కంటే మెరుగ్గా, బలంగా ఉన్నాయి. ఏలియన్లు మమ్మల్ని బంధించాయి. చాలా టార్చర్ పెట్టాయి. చెప్పుకోకూడనివి చాలా చేశాయి’’ అని పేర్కొంది. 




Please Read Disclaimer