కరోనా భయానికి మీడియా సంచలన నిర్ణయం

0

కాదేది కరోనాకు అనర్హం అన్నట్టుంది దేశంలో పరిస్థితి. కరోనా భయంతో ముఖ్యంగా జనావాసాల్లో తిరిగే రిపోర్టర్లు విలేకరులకు చావొచ్చిపడింది. వార్త సేకరణలో వీరు రోడ్లపై ఉండి మనుషులను కలవడం తప్పనిసరి. కానీ వారి ద్వారా మీడియా సంస్థల్లోని ఇతర ఉద్యోగులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉండడంతో దేశంలోని ప్రఖ్యాత మీడియా సంస్థలు అలెర్ట్ అవుతున్నాయి.

తాజాగా మీడియా సంస్థల్లో కరోనా ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్లకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతినిచ్చారు. రిపోర్టర్లు మార్కెటింగ్ ఉద్యోగులు ఫీల్డ్ లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును ప్రముఖ జాతీయ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది.

హైదరాబాద్ తో సహా ఢిల్లీ ముంబై నగరాల్లోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు (రిపోర్టర్లు మార్కెటింగ్) వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించింది. వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు మార్కెటింగ్ సిబ్బంది కరోనా ట్రాన్స్మిటర్లు గా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కు అనుమతిచ్చింది.

ఇక ఈ సంస్థ బాటలోనే మిగతా మీడియా సంస్థలు కూడా నడవడానికి రెడీ అయ్యాయి. కరోనా తగ్గేవరకు వర్క్ ఫ్రం హోం చేయించాలని మీడియా సంస్థలన్నీ నిర్ణయించాయని తెలిసింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-