గుప్త నిధుల వేటలో అధికార పార్టీ నేత

0

అయన అధికార పార్టీకి చెందిన నేత గుప్త నిధుల కోసం అడవి బాట పట్టాడు. తన అనుచరుల్ని వెంటబెట్టుకొని నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో తవ్వకాలు జరిపాడు. ఈ తతంగం అంతా పూర్తీ అయ్యేలోపే ఆ విషయం స్థానిక గిరిజనులుచెంచులకు తెలిసింది. దీంతో ఆ నేత వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తప్పించుకుని అక్కడినుండి పారిపోయాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించడంతో ఆ నాయకుడి వ్యవహారం బయటపడింది. అసలు ఆ గుప్త నిధుల కోసం వెళ్లిన అధికార పార్టీ నేత ఎవరు? ఆ గుప్త నిధుల వేట చేసాడు?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ రేంజ్ పరిధిలోని భ్రమరాంబికాదేవి ఆలయంలో గుప్త నిందుల కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన టీఆర్ ఎస్ నాయకుడు పి.తిరుమలేష్ నాయుడు అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయంలోని విగ్రహాన్ని పెకిలించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో తిరుమలేశ్ నాయుడు తన కారులో అక్కడినుంచి తిరిగి వెళ్లిపోతుండగా స్థానిక గిరిజనులు చెంచులు గుర్తించారు. అయితే వారి నుండి తప్పించుకొని పోవడంతో ..వారు పోలీసులకి ఫిర్యాదు చేసారు. ఆ తరువాత పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం విచారణ జరిపి తిరుమలేశ్ నాయుడిని నిందితుడిగా నిర్ధారించారు. అలాగే ఆయనకు సహాయంగా వడ్డెర పని చేసే ఎల్లప్ప బాలస్వామి శ్రీనులతో పాటు డ్రైవర్ షహబాజ్ అలీ ఉన్నట్లు తేల్చారు.

అయితే వారిని అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు గుప్త నిధుల వేటపై విచారించగా అన్ని విషయాలని బయటపెట్టారు. మొదట ఈ నెల 8వ తేదీన అడవిలో రెక్కీ నిర్వహించి.. సోమవారం సాయంత్రం గుప్త నిధుల తవ్వకాల కోసం అడవిలోకి వెళ్లినట్టు చెప్పారు. ఇకపోతే తిరుమలేశ్ నాయుడు గతంలో రెండు కేసుల్లో రిమాండ్ కు కూడా వెళ్లి బెయిల్ పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ మార్చిస్తానని చెప్పి.. ఓ ఇన్ స్పెక్టర్ తో కలిసి పలువురిని మోసం చేసిన కేసులో తిరుమలేశ్ నాయుడు రిమాండ్ కు వెళ్లాడు. కొద్ది రోజులకే నార్సింగ్ లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో రివాల్వర్ తో బెదిరించిన ఘటన లోనూ జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ రెండు కేసుల్లో ఓ వైపు విచారణ జరుగుతుండగానే తాజాగా గుప్త నిధుల కోసం వెళ్లి మరోసారి పోలీసులకు చిక్కాడు
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-