ఒక్కొక్కటిగా బయటపడుతున్న ట్రంప్ రాసలీలలు .. !

0

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ .. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పలు బుల్లితెర వ్యాఖ్యాత గా రచయిత గా పనిచేసారు. ఆ సమయంలో పలు మోడల్స్ తో పాటు మాజీ లవర్స్ తో సాగించిన రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2016 లో అధ్యక్ష ఎన్నికకు ముందు ట్రంప్ పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అమెరికాలోని కొన్ని పత్రికలు కూడా తెలిపాయి. తాజాగా మరో సమ్మర్ జెర్వోస్ అనే మాజీ మోడల్ తనని ట్రంప్ మోసం చేసాడు అంటూ కోర్టులో పరువునష్టం దావా వేసింది.

ట్రంప్ తనపై జరిపిన లైంగిక దాడికి ఆధారాలు ఉన్నాయని కోర్టుకి తెలిపింది. ఆయన సెల్ ఫోన్ రికార్డులను ఆయన ప్రయివేటు క్యాలెండర్ లోని వివరాలను కోర్టుకు సమర్పించింది. 2007 లో ట్రంప్ నుంచి తనకు కాల్ అందిందని దాంతో కాలిఫోర్నియా లోని బెవెర్లీ హిల్స్ హోటల్ కు వెళ్లిన తనపట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని సమ్మర్ జెర్వోస్ తెలిపింది. గత నెల 24 న కోర్టు ఫైలింగ్ లో తన క్లయింటు.. ట్రంప్ నిర్వాకాలను వివరించిందని ఆమె తరఫు అటార్నీ మేరియన్ వాంగ్ తెలిపారు.

కానీ ఈ మాటలని మాత్రం ట్రంప్ తోసిపుచ్చారు. ఆ రియాల్టీ షో 14 సీజన్లకు తాను హోస్ట్ గా వ్యవహరించానని అయితే ఈమెకూడా ఓ కంటెస్టెంట్ అన్న విషయం తనకు గుర్తు లేదని అన్నాడు.అయితే సమ్మర్ మాత్రం ఆయనను అబధ్ధాలకోరుగా చెప్పింది. తన జాతీయ అంతర్జాతీయ హోదాను అడ్డుపెట్టుకుని తనపై ఉన్న కేసులని మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిపారు. ఈమె తో పాటుగా మరికొంతమంది ట్రంప్ విషయంలో కోర్టుకెక్కారు.
Please Read Disclaimer