శ్రీవారి దర్శనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

0

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ మేరకు అనుమతి ఇవ్వాలని టీడీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ట్రయల్ పద్ధతిలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది.

జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో టీటీడీ ముందుగా ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరంతో పాటు ఇతర మార్గదర్శకాలను పాటిస్తూ ట్రయల్ దర్శనం నిర్వహించబోతోంది. ఈ వారం రోజులు ఇలా నిర్వహించాక తగు జాగ్రత్తలతో ఈ నెల 8 నుంచి సాధారణ, వీఐపీ దర్శనాలకు అనుమతి ఇచ్చే అవకాశముంది.
Please Read Disclaimer