గుంటూరు బీటెక్ విద్యార్థిని రేప్ కేసులో ట్విస్ట్

0

గుంటూరు బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.యువతి పై అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలను పోర్న్ సైట్ లో పెట్టిన ఈ కేసులో ఇద్దరు యువతుల ప్రేమయం కూడా ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఆ యువతిపై రేప్ కేసులో బాయ్ ఫ్రెండ్స్ వరుణ్ కౌశిక్ లతోపాటు వరుణ్ స్నేహితురాలు యువతి ఏ1గా.. మరొక యువతి కౌశిక్ సోదరి ఏ2గా పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ ఇద్దరూ యువతులను రూమ్ మేట్స్ గా గుర్తించారు.యువతికి సంబంధించిన వీడియో వీరి వద్ద నుంచే కౌశిక్ కు చేరి అక్కడి నుంచి ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయినట్టుగా గుర్తించారు.

పోలీస్ విచారణలో వరుణ్ నుంచి అతని స్నేహితురాలు రేప్ కు గురైన యువతి వీడియోను సేకరించి కౌశిక్ సోదరికి ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె కౌశిక్ కి ఇవ్వడంతో అప్పటికే ఆమెపై ఆగ్రహంగా ఉన్న కౌశిక్ ఇంటర్నెట్ లో పెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో కీలక పాత్రధారులైన ఆ ఇద్దరు యువతులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన విద్యార్థినికి వరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.వరుణ్ తరుచూ కంబైన్డ్ స్టడీ పేరుతో ఆ యువతిని తన ఫ్లాట్ కు పిలిపించుకొని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అమెపై అత్యాచారం చేశాడు.. వాటిని చూపించి వాటిని ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. 2 లక్షల రూపాయల వరకు బాధితురాలి నుంచి వసూలు చేశాడు. అనంతరం వరుణ్ తో యువతి సంబంధాలు తెంచుకుంది.

ఆ తర్వాత యువతికి ఇంజినీరింగ్ కాలేజీలో కౌశిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వరుణ్ తో ఎఫైర్ పై కౌశిక్ కు తెలిసింది. దీంతో కౌశిక్ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయసాగారు. తమ దగ్గర ఉన్న వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వీరి బండారం బయటపడింది.
Please Read Disclaimer