అమ్మాయిలను ట్రాప్ చేసి బెడ్రూమ్‌కి.. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో..

0

మహిళలను ట్రాప్‌లో పడేసి బెడ్రూమ్‌కి తీసుకెళ్తారు.. వారితో సెక్స్ చేస్తూ గుట్టుగా వీడియోలు తీసి.. క్రమంగా వారిని దూరం పెడతారు. ఆ తరువాత మొదలవుతుంది అసలు సంగతి. మహిళల ఫోన్లు మోగుతాయ్.. పడక గది వీడియోలు తన వద్ద ఉన్నాయని.. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడతారు. అలా భారీ సంఖ్యలో మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు కోల్‌కతా పోలీసులు.

మహిళల పడక గది వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతున్న ముఠాను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టైల్లో విచారించడంతో చీకటి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలతో రాసలీలలు, వీడియోలు బయటపడ్డాయి. వారిలో ఇద్దరు నిందితులు ఉన్నత వ్యాపార కుటుంబాలకు చెందిన వారుకావడం గమనార్హం.

హోటల్ బిజినెస్‌ కుటుంబానికి చెందిన అనీష్, వస్త్ర వ్యాపార కుటుంబానికి చెందిన ఆదిత్య మహిళలను ట్రాప్ చేయడంలో దిట్ట. తమ దారిలోకి వచ్చిన మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. పడక గదికి తీసుకెళ్లి సెక్స్ చేస్తుండగా వీడియోలు తీస్తారు. తమ ఉచ్చులో చిక్కుకున్న మహిళలను క్రమంగా దూరం పెడతారు. అనంతరం నిందితుల ఇంట్లో కుక్‌గా పని చేస్తున్న కైలాష్ యాదవ్ రంగంలోకి దిగుతాడు.

మీ అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని మహిళలకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బేరసారాలు మొదలెడతాడు. అలా చాలా మంది మహిళల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఓ కేసులో కైలాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్లో విచారించేప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల వద్ద ఉన్న వీడియోలు చేసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. సుమారు 182 మంది మహిళల బెడ్రూం వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.