సీఎం అవుతానని అసలు అనుకోలేదు..అంతా ఆమె వల్లే?

0

మహారాష్ట్ర నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు వెల్లడించిన సంచలన తీర్పుతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్న అందరికి సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో మూడు రోజుల ప్రభుత్వం కథ మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. దీనితో శివసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టేందుకు అన్ని పనులని వేగంగా పూర్తి చేసింది. గవర్నర్ ను కలిసి సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం.. కూటమి సీఎం అభ్యర్థిగా ఉద్దవ్ ని ప్రతిపాదించడం అన్ని చాలా వేగంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయ్యారు.

దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన మహారాష్ట్రను పాలించే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్ర రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు. దీనికి కారణమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ – ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్న క్లిష్టమైన సమయంలో ఇలాంటి అవకాశం రావడం ఛాలెంజ్ గా ఉంది అని – అన్ని సమస్యలకి తగిన పరిష్కారం ఈ ప్రభుత్వం చూపుతుంది అని చెప్పారు.

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన కాళిదాస్ కొలంబర్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయిస్తున్నారు. సాధారణంగా ముందు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసెంబ్లీ లో ఎమ్మెల్యే లు ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేకుండానే ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తుండటం విశేషం. అసెంబ్లీలో ఓ పక్క ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం జరుగుతుండగానే శివసేన అధినేత ఉద్దవ్ థాకరే భార్య రష్మీతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కోష్యారీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు – తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
Please Read Disclaimer