జగన్ సర్కార్‌కు మరో ట్విస్ట్.. ఈసారి పోలవరం వంతు

0

పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్రం మరోసారి లేఖ రాసింది. రెండు వారాల క్రితం పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రెండు రోజుల్లోగా ఈ లేఖపై తగిన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా తాజాగా లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలపై నివేదిక పంపాలంటూ రెండు వారాల క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) జగన్ సర్కార్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించ లేదు. రివర్స్‌ టెండరింగ్‌పై ప్రాజెక్ట్ అథారిటీ విముఖత ప్రదర్శించినా.. ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో కేంద్రం వివరణ కోరింది. ఈ నిర్ణయం వెనుక కారణంపై నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో లేఖ రాసింది.
Please Read Disclaimer