మెగా బ్రదర్ కోసం ప్రచారానికి కుటుంబం రెడీ!

0

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఒకవైపు నామినేషన్ల పర్వం ముగిసింది. మరోవైపు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పార్టీలవారు సినీ గ్లామర్ ను వాడుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ అద్యక్షుడుగా ఉన్న జనసేనకు మాత్రం ఎందుకో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు దూరంగానే ఉంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఉన్న ఎంతమంది హీరోలు పవన్ కోసం ప్రచారం చేస్తారన్నది కూడా తెలియదు. దాదాపు హీరోలందరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం వరకూ సరేగానీ ప్రత్యక్షంగా నియోజకవర్గాలలో తిరుగుతూ ఎంతమంది ప్రచారానికి వస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే పవన్ అన్నయ్య నాగబాబు కొద్దిరోజుల క్రితం జన సేన లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. నాగబాబు జనసేన తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీపడుతున్నారు. మరి నాగబాబు తరఫున తనయుడు వరుణ్ తేజ్.. తనయురాలు నిహారిక ప్రచారం చేస్తారా అనేది ఇప్పుడొక ఒక హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం మేరకు వారిద్దరూ ప్రచారానికి సిద్దం అవుతున్నారట. నిహారిక ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సూర్యకాంతం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మార్చ్ 29 న రిలీజ్ కాబట్టి ఆ తర్వాత ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతోందట.

వరుణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఈ వారంలోనే వరుణ్ ఇండియాకు తిరిగి వస్తున్నాడట. ఇక్కడికి రాగానే మూడు రోజుల పాటు నాన్నగారి తరఫున వరుణ్ ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ ప్రచారంలో నాగబాబు సతీమణి పద్మజగారు కూడా పాల్గొంటారని సమాచారం. గోదావరి జిల్లాలలో మెగా అభిమానుల సంఖ్య కాస్త ఎక్కువే కాబట్టి ప్రచారం సమయంలో ఫుల్ హంగామా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Please Read Disclaimer