కరోనాపై ఉపరాష్ట్రపతి వెంకయ్య హాట్ కామెంట్

0

ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో కరోనా చూపించింది. మనషి నాశనం చేసిన నదులను తనకు తానుగా క్లీన్ చేసుకుంది. గంగా నది కోసం కోట్లు పెట్టినా కానిది కరోనా రెండు నెలల కాలంలో పూర్తి చేసింది. కాలుష్యాన్ని అరికట్టింది. ప్రకృతిని క్లీన్ చేసింది. ఇప్పటికే కరోనాతో ఇంత ఉపద్రవం వచ్చిపడినా ప్రకృతికి మాత్రం మేలే చేసింది. విచ్చలవిడిగా మనిషి చేస్తున్న దురాగతాలకు ఈ వైరస్ చెక్ పెట్టింది. అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టింది.

ఇదే విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అన్నారు. జీవితం ఎంతో సాఫీగా దూసుకెళ్తోందని భ్రమపడిన సమయంలో జీవితంలోకి కనిపించకుండా కరోనా వచ్చిందని వెంకయ్య అన్నారు.

ఆగిపోయే ‘పాజ్ బటన్’ నొక్కినట్టుగా జీవితాన్ని ఆపేసిందని.. రీసెట్ బటన్ ద్వారా పున: ప్రారంభాన్ని కూడా చూపిందని వెంకయ్య హాట్ కామెంట్స్ చేశారు. రెండు జీవన విదానాల మధ్య ఇదొక సంధి కాలం అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.