గాంధీభవన్ లోనే కుట్ర: విజయశాంతి సంచలనం

0

ఇటీవల కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ కుదేలవ్వడం.. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడం తెలిసిందే. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అన్న అంచనాలు వచ్చేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా విజయశాంతి ఈ మధ్య అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

దీంతో విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.ఆమె త్వరలోనే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని అన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా విజయశాంతి స్పందించారు.

తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలపై విజయశాంతి భగ్గుమన్నారు. గాంధీభవన్ లో తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని.. కాంగ్రెస్ ను వీడేది లేదని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. గాంధీభవన్ లోని తన వ్యతిరేకులే ఈ ప్రచారం మొదలు పెట్టారని ఆమె దుయ్యబట్టింది.

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలపై తాను పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో మాట్లాడానని.. చేరడం లేదని క్లారిటీ ఇచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు. బీజేపీలో చేరనని.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇలా హడావుడి నిర్ణయాలు తీసుకోనని .. పార్టీ మారాలనుకుంటే ధైర్యంగా మీడియాకు వెళ్లడిస్తానని స్పష్టం చేశారు.

కాగా విజయశాంతి ప్రస్తుతం దాదాపు 12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు. మహేష్ హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సినిమాల్లో నటిస్తూనే కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు.
Please Read Disclaimer