కేసీఆర్ సీక్రెట్ ను రివీల్ చేసిన ఫైర్ బ్రాండ్!

0

నమ్మకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. తనకు నచ్చిన సచివాలయాన్ని అర్జెంట్ గా మార్చేయాలని డిసైడ్ కావటం.. అందుకోసం తగిన స్థలాల్ని ఎంచుకోవటం కోసం ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన.. గడిచిన ఐదేళ్లలో పది సార్లు కూడా సచివాలయానికి వెళ్లటానికి ఇష్టపడని ఆయన తనకు నచ్చినట్లుగా నిర్మించిన సచివాలయంలోనే అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతారు.

సచివాలయ నిర్మాణం కోసం ఇప్పటికే పలు ప్రాంతాల్ని ఎంపిక చేసుకోవటం.. ఏదో వివాదం తెర మీదకు రావటంతో వెనక్కి తగ్గిన వైనం తెలిసిందే. కేంద్రాన్ని ఒప్పించి.. బైసన్ పోలో గ్రౌండ్ ను సచివాలయం కోసం ఓకే చేసుకున్న కేసీఆర్.. తాజాగా తన మనసు ఎందుకు మార్చుకున్నారు?

ఇప్పుడున్న సచివాలయ ప్రాంగణలోనే ఎందుకు కొత్త సచివాలయాన్నిఏర్పాటు చేస్తున్నారు? ఎంతో వ్యతిరేకత వ్యక్తమైనా.. వాటి విషయంలో వెనక్కి తగ్గని కేసీఆర్.. తాజాగా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? అన్న ప్రశ్నలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు.

బైసన్ పోలో నుంచి ఇప్పుడున్న సచివాలయంలోనే భవనాల్ని కూల్చేసి కొత్త భవనాల నిర్మించాలన్న ఆలోచన వెనుకున్న రహస్యాన్ని తనకు టీఆర్ ఎస్ నేతలే చెప్పినట్లుగా విజయశాంతి పేర్కొన్నారు.

ఫేస్ బుక్ పేజీలో తాను చేసిన తాజా పోస్ట్ లో వివరంగా వెల్లడించారు. ఆసక్తికరంగా మారిన ఈ పోస్టులో ఏముంది? కేసీఆర్ రహస్యాన్ని విజయశాంతికి చెప్పిందెవరన్న విషయంలోకి వెళితే..

విజయశాంతి పోస్టు యథాతధంగా..

నిన్నటి వరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు చాలా పెండింగులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బైసన్ గ్రౌండ్ కోసం కెసిఆర్ గారు తెగ పైరవీలు చేశారు. ఎట్టకేలకు కేసీఆర్ గారు చేసే ప్రయత్నం ఫలించింది. ఆయన రెండోసారి సీఎం అయిన వెంటనే కేంద్రం కూడా కెసిఆర్ గారి కోరిక మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బైసన్పోలో గ్రౌండ్ అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతా సజావుగా జరిగింది అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ గారి మైండ్ సెట్ సడన్ గా మారిపోయింది.

బైసన్ పోలో గ్రౌండ్ వద్దు… పాత సచివాలయ ప్రాంగణం ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు. అంతగా కావాలంటే పాత సచివాలయ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తామని కెసిఆర్ ఇప్పుడు చెప్తున్నారు. కెసిఆర్ గారి మైండ్ సెట్ అకస్మాత్తుగా మారడం వెనుక అసలు రహస్యం ఒకటి ఉందని ఇటీవల కలిసిన టిఆర్ఎస్ నేతలు కొందరు నాతో చెప్పిన మాటలు విని ఆశ్చర్యం కలిగింది.

బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మించడానికి తలపెట్టి – శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త సచివాలయంలో కి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు నాతో చెప్పారు. తీరా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా కెసిఆర్ గారి పరిస్థితి మారింది.

దీంతో టిఆర్ఎస్ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అనే ఆలోచన కేసిఆర్ లో మొదలయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి అని కెసిఆర్ లో ఆందోళన మొదలైనట్లు టిఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. దాంతో పాత సచివాలయ ప్రాంగణం లోనే పునర్నిర్మాణం చేసి – డిజైన్ మార్చాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇలాంటి వింతలు – విడ్డూరాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాన్ని మార్చే మాటేమోగాని…. కెసిఆర్ గారి మైండ్ సెట్ మారకపోతే సీఎం పదవి నుంచి ఆయనను మార్చడానికి తెలంగాణ ప్రజలు వెనుకాడరు అనే విషయాన్ని టిఆర్ఎస్ అధిష్టానం గుర్తించాలి.
Please Read Disclaimer