ఆ ఆరోపణలు బాధించాయి.. జనసేనాని ఆవేదన

0

వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి వైఎస్ఆర్సీపీ పాలనపై స్పందించారు. జగన్ పాలనపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. పారదర్శక పాలన అందిస్తామని పదే పదే చెబుతోన్న జగన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. పారదర్శకత అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలని పవన్ ట్వీట్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయనే వార్తలపై జనసేనాని స్పందించారు.

‘‘ఎన్నో ఆశలతో, తమ జీవితాలు మారతాయనే ఆలోచనలతో యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. కానీ ఉద్యోగాలు ప్రతిభావంతులకు దక్కకుండా.. అధికార పార్టీని నడిపే నాయకుల వెనుకున్న వారికి దక్కాయ’’ని పవన్ ఆరోపించారు.

పరీక్ష పేపర్లు లీకయ్యాయనే ఆరోపణలు కలతపెట్టాయని జనసేనాని తెలిపారు. ఈ విషయమై ఏపీ సర్కారు స్పందించాలని, వెంటనే విచారణకు ఆదేశించాలని పవన్ డిమాండ్ చేశారు.

గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకయ్యాయనే వార్తలపై జనసేన కూడా స్పందించింది. ‘పారదర్శకతతో, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించాం అని డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెర లేపిన జగన్ ప్రభుత్వం’ అంటూ జనసేన ట్వీట్ చేసింది.
Please Read Disclaimer