‘కరోనా’ కన్నా కరుడుగట్టిన వైరస్ ఇదే!

0

కరోనా….ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. భారత్ సహా ఇప్పటికే 20 దేశాలకు ఈ వ్యాధి త్వరితగతిన విస్తరిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి 213 మంది ప్రాణాలు కోల్పోగ….దాదాపు 10 వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే కరోనాకంటే ప్రమాదకరమైన వైరస్లు అమెరికాను అతలాకుతలం చేశాయన్న సంగతి వెలుగులోకి వచ్చింది.

కొంతకాలం క్రితం అమెరికాలో ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకి వేలాది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 15 లక్షల మందిని ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ పట్టి పీడించింది. హెచ్1 ఎన్1 అని పిలుచుకునే ఈ వైరస్కు భయపడి లక్షన్నరమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన గణాంకాలు చూస్తే…కరోనా కన్న ఫ్లూ పెద్ద మహమ్మారి అని స్పష్టమవుతోంది. 2017-18లో ఫ్లూ జ్వరంతో 61 వేల మంది చనిపోగా…గత ఏడాది 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా అమెరికాలో 12 వేల నుంచి 64 వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది ఫ్లూ వైరస్తో చనిపోతున్నారట. హెచ్1 ఎన్1 వైరస్ను అంతం చేసిన ఏడాది లోపే రూపం మార్చేసుకొని దాడికి సిద్ధమవుతోందట. దీనిని బట్టి చూస్తే….హెచ్1 ఎన్1 వైరస్ హైనా….కరోనా సే మత్ డరోనా..అనక తప్పదేమో!
Please Read Disclaimer