కరోనా-ఆన్లైన్ క్లాస్‍లు: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై హైకోర్టుకు పేరెంట్స్

0

కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీలు కార్యాలయాలు సహా స్కూల్స్ కాలేజీలు కూడా మూతబడ్డాయి. కరోనా ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని స్కూల్స్ అలాగే కొంతమంది పేరెంట్స్ ఈ-స్కూల్ బాట పట్టారు. ఇప్పటికే ఫీజుల భారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ల పేరుతో కొన్ని స్కూల్స్ మరింత ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రైవేటు స్కూల్స్ ఫీజులు ఆన్లైన్ క్లాసులపై హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టు మెట్లు ఎక్కింది.

జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ పిల్ దాఖలు చేసింది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పేర్కొంటూ తమ ఫిర్యాదులకు సాక్ష్యంగా తమకు వచ్చిన మెసేజ్లను పొందుపరిచారు పేరెంట్స్. ఈ పిల్ను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది.

కరోనా నేపథ్యంలో స్కూల్ ఫీజుల వసూల్లపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని అది కూడా నెలవారీగా ఫీజులు తీసుకోవాలని జీవో 46ను విడుదల చేసింది ప్రభుత్వం. స్కూల్ ఫీజుల పేరుతో వేధింపులు వస్తే ఫిర్యాదు చేయవచ్చునని కూడా తెలిపింది. కానీ ఈ అదేశాలను పలు స్కూల్స్ పట్టించుకోవడం లేదు. దీంతో పేరెంట్స్ హైకోర్టు మెట్లు ఎక్కారు.
Please Read Disclaimer