డ్రగ్స్‌కు బానిసై.. నగ్న చిత్రాలతో ప్రియురాలికి వేధింపులు

0

డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు డబ్బు కోసం ప్రియురాలినే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ప్రియుడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలియని ఆ యువతి సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ట్విస్ట్‌తో పోలీసులు సైతం అవాక్యయ్యారు. విశాఖ నగరానికి చెందిన యువతీ యువకుడు ప్రేమించుకుంటూ కొంతకాలం బాగానే ఉన్నారు. ఎలా అలవాటైందో తెలీదు గానీ ఆ యువకుడు క్రమంగా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేనప్పుడల్లా ప్రియురాలిని వేధించేవాడు.

కొన్నాళ్లకు ఆమె డబ్బులు ఇవ్వనని చెప్పేయడంతో ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను బయటకు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులతో కొన్నాళ్లు ఓపిక పట్టిన బాధితురాలు సహనం నశించి చివరకు వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు నిందితుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకుని షాకయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి అవసరమైన నగదు కోసం ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి దిగజారాడని గుర్తించారు.

దీంతో అతడికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారని నిఘా పెట్టి నలుగురిని గుర్తించారు. ఆ నలుగురికి మరో ఇద్దరు వాటిని చేరవేస్తున్నట్లు తెలిసింది. వారు ముంబయి, బెంగళూరు నుంచి విశాఖ నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. . డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులు నగరంలోని వివిధ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ అని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. దీంతో ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
Please Read Disclaimer