రూ.10 కోట్ల ఆస్తి ఉన్న వధువు కావాలట!

0

వధూవరుల కోసం పేపర్ లో ప్రకటనలు మామూలే. రోటీన్ కు భిన్నంగా పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక ఉపాధ్యాయుడు అందులో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కట్నకానుకల మీద నిషేధం నేపథ్యంలో తెలివిగా తన అవసరాల్ని.. కోరికల్ని బయటపెట్టాడు.

తాను పెళ్లాడాలనుకున్న వధువుకు రూ.10 కోట్ల ఆస్తి ఉండాలన్న షరతు పెట్టాడు. సిలిగురికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోర్కెల చిట్టాలో వధువుకు రూ10 కోట్ల ఆస్తి ఉండాలని పేర్కొన్నాడు. ఈ ప్రకటన స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై నెటిజన్లు పలు మీమ్స్ ను క్రియేట్ చేశారు. ప్రకటన ఇచ్చిన వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడిగా చెబుతున్నారు. తనకు 42 ఏళ్లు అని పేర్కొన్న అతడు.. తన పేరును మాత్రం ప్రకటనలో ఇవ్వలేదు. ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారటంతో.. రూ.10 కోట్లు కోరుకున్న సదరు వరుడు ఎవరన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే.. సదరు ప్రకటనను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. చూస్తుంటే.. రూ.10 కోట్ల ఆస్తి ఉన్న వధువు రావటం తర్వాత.. లేనిపోని తలనొప్పులు మాత్రం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Please Read Disclaimer