మారుతీరావు పోస్టు మార్టం రిపోర్ట్ లో ఏం తేలింది.?

0

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగుచూసింది. ఆయన ఆత్మహత్య పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది.

మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని.. విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే మారుతీరావు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పని చేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయి ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్టు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు.

మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని ఓ వైశ్యభవన్ లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు డెడ్ బాడీకి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం జరిగింది. ఈ ఉదయం ఆయన అంత్యక్రియల కోసం మిర్యాలగూడకు తీసుకొచ్చారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-