చినజీయర్ స్వామి కారు డ్రైవర్ గా సీఎం కేసీఆర్ …!

0

సీఎం కేసీఆర్ కి దేవుళ్లపై భక్తి కొంచెం ఎక్కువే అని అందరికి తెలిసిందే చినజీయర్ స్వామీజీ అంటే కేసీఆర్ కి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక తాజాగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో సోమవారం స్వామిజీ పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. తిరునక్షత్రోత్సవ వేడుకలు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ. కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. 1986-87లో సిద్ధిపేటలో బ్రహ్మయజ్ఞం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ ముఖ్య అతిథి. చాలా మంది భక్తులు వికాస తరంగిణి మిత్రులు నా వద్దకు వచ్చి.. ఇదొక మంచి కార్యక్రమం మనం తప్పకుండా చేయాలని కోరారు. దానికి నేను సరే అన్నాను. అంతకుముందెప్పుడూ స్వామీజీతో నాకు పరిచయం లేదు. సిద్ధిపేట ప్రాంతంలో అప్పుడు బ్రాహ్మణ పరిషత్ లేదు. స్వామి వారు ఎక్కడ బస చేస్తారనే సంశయం తలెత్తింది. దీంతో గ్రామస్థులు వచ్చి చినజీయర్ స్వామిని మా ఇంట్లోనే ఉంచాలని కోరారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

చినజీయర్ స్వామిని ప్రార్థిస్తే.. తన ఇంట్లో ఉండటానికి అనుగ్రహించారని కేసీఆర్ తెలిపారు. ఏడు రోజుల పాటు ఆయన తమ ఇంట్లోనే బస చేశారని చెప్పారు. ఆ సమయంలో నేను స్వామీజీకి కారు డ్రైవర్గా మారిపోవడం పలు ఆలయాలకు తిరగడం జరిగింది. ఆ ఏడెనిమిది రోజులు నేనే కారును నడపటం స్వామీజీతో పాటే ఉండటంతో చాలా విషయాలు తెలుసుకున్నా. స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ అప్పుడప్పుడు చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home