అమిత్ షాను కలిసిన శ్రీలక్ష్మీ.. కారణమదే..

0

వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి. సీనియర్ ఐఏఎస్ గా చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఈమె. అయితే వైఎస్ హయాంలో గనుల శాఖ కార్యదర్శిగా ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.

వైఎస్ మరణం తర్వాత జగన్ పార్టీ పెట్టడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలైన ఆమె ఆ తర్వాత కేసుల నుంచి విముక్తురాలయ్యారు.

ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లడానికి సిద్ధమయ్యారు. జగన్ ను కలవగా ఆయన సరేనన్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా తాజాగా ఐఏఎస్ శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలంటూ ఆమె అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ప్రక్రియలో జాప్యం జరగడంతోనే ఆమె ఇలా ఢిల్లీ వెళ్లి కోరినట్టు తెలిసింది. తెలంగాణ క్యాడర్ లో ఉన్న త్వరలోనే ఏపీకి రావడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది.
Please Read Disclaimer