కండోమ్స్ అస్సలు వాడట్లేదు.. ఎందుకు.?

0

ఎయిడ్స్ సుఖ వ్యాధుల ను నివారించడంతో పాటు గర్భం రాకుండా చేసే అత్యద్భుత సాధనం ‘కండోమ్’. కానీ ఇప్పుడు దీన్ని వాడమని ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహిస్తున్న పురుషులు మాత్రం వద్దే వద్దంటున్నారట..

తాజాగా కేంద్రం జరిపిన సర్వే లో ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. కండోమ్ వినియోగానికి 40 ఏళ్ల లోపు పురుషులు అస్సలు ఆసక్తి చూపించడం లేదట.. 40-49 ఏళ్ల లోపు వాళ్లు మాత్రమే కండోమ్ వినియోగిస్తున్నట్టు కేంద్రం సర్వే లో తేలింది.

2000 సంవత్సరం లో దేశంలో 38శాతం మంది కండోమ్ వాడి సురక్షిత శృంగారం చేయ గా.. ఇప్పుడు 2018 సంవత్సరానికి వచ్చే సరికి ఆ సంఖ్య 24 శాతానికి పడి పోయిందని కేంద్రం సర్వే తేల్చింది. జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం వీటిని ఆరోగ్య కేంద్రాలు బస్టాండ్ లు ఇతర ప్రాంతాల్లో ఉచితం గా అందించినా వీటిని వాడడానికి మాత్రం పురుషులు ఆసక్తి చూపడం లేదట. దేశం లోని 19 రాష్ట్రాల్లో కండోమ్ ల వాడకం బాగా తగ్గిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పురుషులు కండోమ్ వాడక పోవడానికి ప్రధాన కారణం సంతృప్తి భావ ప్రాప్తిని కండోమ్ దూరం చేస్తుందనేనట.. అందుకే తమకు థ్రిల్ ఇవ్వని కండోమ్ కంటే జంటలు గర్భ నిరోధక మాత్రలు కాపర్ టీ ఇంజెక్షన్లు ట్యూబెక్టమీ వేసేక్టమీ ఇలా ప్రత్యామ్మాయ పద్ధతుల ను అవలంభిస్తున్నారని సర్వే లో తేలింది. భావప్రాప్తి లో అస్సలు రాజీపడని పురుషులు ఇలా కండోమ్ వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తోంది.
Please Read Disclaimer