మోడీ క్వారంటైన్ లోకి ఎందుకు వెళ్లరు: శివసేన

0

Why Modi does not go into the quarantine

Why Modi does not go into the quarantine

అయోధ్య భూమిపూజలో పాల్గొన్న ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆ కార్యక్రమంలో ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఇదే అయోధ్య భూమిపూజలో గోపాల్ దాస్ తో కలిసి పాల్గొన్న ప్రధాని మోడీ క్వారంటైన్ లోకి వెళ్తారా? అని శివసేన ప్రశ్నించింది. ప్రధాని మోడీ ఎందుకు క్వారంటైన్ నిబంధనలు పాటించరు ? అని సామ్నా వేదికగా ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.

అయోధ్య భూమిపూజలో ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారని.. మోడీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారని.. మోడీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

ఇక రష్యా వ్యాక్సిన్ కనిపెట్టిందని.. మన బీజేపీ సర్కార్ మాత్రం ఆత్మనిర్భర్ భారత్ అంటూ ఉపన్యాసాలు ఇస్తూనే ఉందని కేంద్రం వైఖరిపై సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.