రాష్ట్రపతితో సడన్ గా భేటి? మోడీ భారీ స్టెప్?

0

చైనాతో సరిహద్దు వివాదం.. లఢక్ లో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ సడన్ గా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటి కావడం రాజకీయంగా వేడి పుట్టించింది. ప్రధాని మోడీ ఏదో భారీ స్టెప్ వేయబోతున్నాడంటూ ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇద్దరూ జాతీయఅంతర్జాతీయంగా ఉన్న ప్రధాన అంశాలపై రాష్ట్రపతి భవన్ లో చర్చించారు. తూర్పు లఢక్ లో మోడీ పర్యటన తర్వాత ఈ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లఢక్ పర్యటన గురించి మోడీ రాష్ట్రపతికి వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. అలాగే కరోనా వైరస్ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించినట్టు సమాచారం.

కొద్దిరోజులుగా ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా నేపథ్యంలో మోడీ యుద్ధసన్నాహాల్లో భాగంగానే రాష్ట్రపతిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.