రేవంత్ తో స్నేహం.. రవిప్రకాష్ అరెస్ట్ కు కారణమా?

0

టీవీ9లో అంత పెద్ద మోసం జరిగినప్పుడు ఆ చానెల్ మాజీ సీఈవో అరెస్ట్ కాలేదు.. ఇక ఫోర్జరీ – చీటింగ్ కేసులు నమోదు అయినప్పుడు కూడా పోలీసులు జైలుకు పంపలేదు. ఇప్పుడు సడన్ గా పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని.. పాత కేసును తవ్వి తీసి రవిప్రకాష్ ను జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన చర్చ.. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో దోస్తీ కట్టి హుజూర్ నగర్ లో వేలు పెట్టడమే రవిప్రకాష్ అరెస్ట్ కు దారితీసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..

తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు వార్త వచ్చింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం. గతంలో టీవీ9 కార్యాలయానికి వెళ్లినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే ఇప్పుడు ఎందుకు అత్యవసరంగా అరెస్ట్ చేశారన్న కారణంపై ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది..

అప్పట్లో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఫోర్జరీ – చీటింగ్ కేసులు నమోదయ్యాక ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఆ పార్టీ అండతో చానెల్ పెడుదామని అనుకున్నారు.అమిత్ షాతో ఉన్న ఫొటోను రవిప్రకాష్ సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆయనపై విచారణ తెలంగాణలో నెమ్మదించింది. కానీ అమిత్ షా మాత్రం రవిప్రకాష్ తో చానెల్ ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు.

అయితే తాజాగా రవిప్రకాష్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపినట్టు టీఆర్ఎస్ వర్గాలకు సమాచారం అందిందట.. రేవంత్ రెడ్డికి స్పీచుల దగ్గర నుంచి రాజకీయ సలహాలను దగ్గరుండి రవిప్రకాష్ తయారు చేయిస్తున్నారని సమాచారం లీకైందట.. అంతేకాదు.. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ లో కూడా రవిప్రకాష్ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. పొలిటికల్ మెసేజ్ లను దగ్గరుండి తయారు చేయిస్తున్నట్టు టీఆర్ఎస్ కు ఉప్పందిందట.. సోషల్ మీడియాలో ఈ తరహా కథనాలు రావడంతో ఇక టీఆర్ఎస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాత కేసులు తవ్వి తీసి రవిప్రకాష్ ను తాజాగా అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు తెలుస్తోంది.