సెక్స్‌ చేద్దామని పిలిచి, నిద్రపోయాడని.. ప్రియుడిని ఇంట్లో బంధించి నిప్పు పెట్టింది!

0

‘‘ఇంటికి రా.. రెచ్చిపోదాం’’ అంటూ అతడు చాలా రొమాంటిక్‌‌గా ఆమెను ఇంటికి పిలిచాడు. తీరా ఆమె ఇంటికెళ్లిన తర్వాత తలుపులు తీయకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయాడు. దీంతో ఆమె కోపం నషాలానికి అంటింది. ఎంతగా అంటే.. అతడిని ఆ ఇంట్లోనే బంధించి తగలబెట్టేంత! అమెరికాలోని న్యూ జెర్సీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

‘యూఎస్‌ఏ’ టుడే కథనం ప్రకారం.. తైజా రస్సెల్ (29) అనే మహిళ ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు తన ఇంటికి వస్తే సెక్స్ చేసుకుందామని అతడు రస్సెల్‌కు చెప్పాడు. దీంతో ఆమె చాలా థ్రిల్‌గా ఫీలైంది. రాత్రంతా నిద్ర మానుకుని ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసింది. అతడు చెప్పిన సమయానికి ఎంతో ఆతృతగా అక్కడికి చేరుకుంది. 

అతడు అప్పటికే గాఢ నిద్రలో ఉండటంతో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా లేవలేదు. ఫోన్ చేసి నిద్రలేపేందుకు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఆమె కోపం తీవ్రమైంది. సమీపంలో ఉన్న గ్యాస్ స్టేషన్‌కు వెళ్లి ఇంధనం కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాన్ని అతడి ఇంటి చుట్టూ చల్లి నిప్పంటించి పారిపోయింది. 

ఇంట్లోకి పొగచేరి ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో బాధితుడు నిద్ర లేచాడు. కళ్లు తెరిచి చూసేసరికి ఇంటి చుట్టూ దట్టమైన పొగ, మంటలు. తప్పించుకుందామంటే.. ఆమె బయట నుంచి తలుపులకు గడియ పెట్టేసింది. దీంతో కిటికీ తలుపులు పగలగొట్టి పరుగులు పెట్టాడు. భయంతో వుడ్‌బ్యూరీ పొలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఎవరో తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అతడి ఇంటికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. 

సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోలను పరిశీలించిన పోలీసులు రస్సెల్ ఇంటికి నిప్పు పెట్టడం చూసి షాకయ్యారు. బాధితుడిని పిలిచి.. ఆమె మీకు తెలుసా? అని అడిగారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి రమ్మని ఆమెను పిలిచానని, ప్రమాదం సమయానికి ఆమె కనిపించలేదని చెప్పాడు. దీంతో పోలీసులు రస్సెల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ‘‘సెక్స్ చేసుకుందాం, 4 గంటలకు వచ్చేయమని చెప్పాడు. అంత కష్టపడి ఇంటికెళ్తే.. నిద్రపోయాడు. అందుకే ఇల్లు తగలబెట్టేశా’’ అని చెప్పింది. పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్రం ఏమిటంటే.. ఏప్రిల్ నెలలో ఇదే ప్రాంతంలో మరో మహిళ కూడా ఇలాగే ఓ వ్యక్తిని ఇంట్లో బంధించి నిప్పుపెట్టింది. వరుస ఘటనలతో అక్కడి పోలీసులు ‘ఇదేం ట్రెండ్‌ రా.. బాబు’ అని తలలు పట్టుకుంటున్నారు. Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home