15 ఏళ్ల బాలుడిని 20 సార్లు రేప్ చేసి.. కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

0

ఓ మహిళ 15 ఏళ్ల బాలుడిని లోబరుచుకుని పదే పదే అత్యాచారానికి పాల్పడింది. ఫలితంగా ఆమె పెళ్లి కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాధితుడు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు.

సంచలనంగా మారిన ఈ ఘటన ఫ్లొరిడాలోని ఓర్నాల్డోలో చోటుచేసుకుంది. బాధితుడు కోర్టుకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్ప్రింగ్ టర్నర్ అనే 41 ఏళ్ల మహిళ.. తన ఇంటి వద్ద నివసిస్తున్న 15 ఏళ్ల బాలుడిని లోబరుచుకుంది. తనతో సెక్స్ చేయకపోతే అతడి సోదరుడిని ఉద్యోగం నుంచి తీయించేస్తానని, ఇంటి నుంచి బయటకు పంపించేసేలా చేస్తానని బెదిరించింది. ఆ తర్వాత బాధితుడిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేది. ఈ సందర్భంగా ఆమె అతడికి వయాగ్రా ఇచ్చేది. గత రెండేళ్లలో ఆమె దాదాపు 20 సార్లు అతడిపై అత్యాచారానికి పాల్పడింది.

అయితే, ఈ విషయాన్ని బాధితుడు ఓ రోజు బయటకు చెప్పలేదు. ఆ బాధితుడి ఫ్యామిలీ ఫ్రెండ్‌కు టర్నర్ తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆమె అతడు ఇష్టపూర్వకంగానే తనతో సెక్స్ చేసేవాడని, తనని అత్యాచారం చేయలేదని పేర్కొంది. అప్పటికి అతడి వయస్సు 17 ఏళ్లని తెలిపింది. అయితే, ఫ్లొరిడాలో 18 ఏళ్లు నిండిన వ్యక్తులతో మాత్రమే సెక్స్ చేయాలనే నిబంధన ఉంది. బాధితుడికి 17 ఏళ్లు కావడంతో పోలీసులు అత్యాచారం కేసుగా నమోదు చేశారు.
Please Read Disclaimer