అత్యాచారం కేసులో బాధితురాలు వింత వాదన: షాక్ కు గురైన హైకోర్టు

0

కొందరు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ అలాంటి వారు వెంటనే దొరికిపోతారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. అత్యాచారానికి గురయ్యానని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుపై కోర్టులో విచారణ మొదలైంది. ఈ సందర్భంగా బాధితురాలి నుంచి న్యాయవాదులు వివరాలు సేకరిస్తుండగా ఆమె వింత వింత సమాధానాలు తెలిపింది. అత్యాచారానికి గురైన అనంతరం తాను అలసిపోయి నిద్రించినట్లు చెప్పడంతో న్యాయస్థానం షాక్ కు గురయ్యింది. ఆమె సమధానాలపై అనుమానం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈ కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కర్నాటకలో తన సహోద్యోగి తనను అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. చివరకు ఈ కేసు హైకోర్టుకు చేరింది. బాధితురాలి వివరాలు తెలుసుకుంటుండగా పై విధంగా ఆమె సమాధానం ఇచ్చింది. దీనిపై హైకోర్టు ఆమెను తప్పు పట్టింది. బాధితురాలి మాటలు ఇలా ఉండవని పేర్కొంది.

ఈ సందర్భంగా అసలు జరిగిన విషయం కోర్ట్ తెలుసుకుంది. అర్ధరాత్రి తన సహోద్యోగి తో ఆమౄ ఆఫీస్ కు వెళ్లడం.. ఆ తర్వాత అతడితో కలిసి మద్యం సేవించడం.. ఆ రాత్రంతా అక్కడే గడపడం వంటి విషయాలు హైకోర్టు తెలుసుకుని అవాక్కైంది. ఆమె తీరును తప్పు పట్టింది. ఆమె ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లి రాత్రంతా గడిపిందని భావిస్తోంది. దీనిపై ఆమెకు హెచ్చరించి పంపించేసింది. ఆమె తీరంతో అమాయకులపై తీవ్ర ప్రభావం పడుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Please Read Disclaimer