బాల భీముడు…ఎన్ని కిలోల బరువుతో పట్టాడంటే ?

0

శిశువులు 2 నుంచి 3.5 కేజీల బరువుతో జన్మించడం సర్వ సాధారణం. ఈ మధ్య బరువుతో శిశివు జన్మిస్తే హెల్తీ అని కూడా చెబుతారు. అంతకంటే తక్కువ బరువుతో శిశివు జన్మించడం అంత మంచిది కాదు అని చెప్తుంటారు. కానీ ఓ తల్లి తాజాగా బాల భీముడికి జన్మ నిచ్చింది. . ఆ బాబు బరువు చూసి తల్లే కాదు డాక్టర్లు కూడా నోరెళ్ల బెట్టారు. ఆ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగ శిశువుకి జన్మనిచ్చింది.

పూర్తీ వివరాలు చూస్తే … తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ కు చెందిన నేహా ప్రసవం కోసం నిర్మల్ జిల్లా కేంద్రం ప్రసూతి ఆసుపత్రి కి వచ్చింది. మంగళవారం ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ బరువు 5.5 కిలోలు.

ఆమెకి మొదట సాధారణ కాన్పు చేయాలని వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరకపోవడంతో డాక్టర్లు రాజేందర్ సరోజ మమత శస్త్రచికిత్స చేశారు. 5.5 కిలోల బరువుతో పండంటి మగబిడ్డ పుట్టాడు. పసికందు ఇంత బరువుతో జన్మించటం చూసి డాక్టర్లు విస్తుపోయారు. ఇలా జరగడం చాలా అరుదని చెప్పారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. పుట్టగానే ఆ బిడ్డ న్యూస్ లోకి ఎక్కేయడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
Please Read Disclaimer