బీచ్‌లో అందాల ఆరబోత.. బికినీ భామను అరెస్టు చేసిన పోలీసులు

0

ఓ యువతి బీచ్‌లో బికినీ ధరించి అందాలు ఆరబోసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తైవాన్‌కు చెందిన లిన్ జు టింగ్ (26) హాలీడేస్‌ ఎంజాయ్ చేయడం కోసం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫిలిప్పీన్స్‌లోని బొరాకే దీవిలోని పుకా బీచ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె తెల్ల రంగు బికినీని ధరించింది. అయితే, ఆ బికినీ నుంచి ఆమె స్తనాలు బయటకు స్పష్టంగా కనిపించడంతో ఆ బీచ్‌లోని సందర్శకులంతా ఆమెను అదోలా చూడటం మొదలుపెట్టారు. కొంతమంది ఆమె అందాల ప్రదర్శన చూసి ఇబ్బందిపడ్డారు.

ఆమె మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా బీచ్‌లో ఫొటోలకు పోజులిస్తూ గడిపేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో బొరాకే ఇంటర్ ఎజెన్సీ రిహబిలేషన్ మేనేజ్మెంట్ గ్రూప్ (BIAMRG) వరకు వెళ్లాయి. దీంతో ఆ సంస్థ టింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు టింగ్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కేసు నమోదు చేశారు. హోటల్‌కు వెళ్లి మరీ ఇద్దరినీ అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మలాయ్ టౌన్ పోలీస్ చీఫ్ మేజర్ జెస్ బేలాన్ మాట్లాడుతూ.. ‘‘టింగ్ తాను తప్పు చేయలేదని చెబుతోంది. తైవాన్‌లో కూడా ఆమె ఇలాంటి బికినీలతోనే బీచ్‌లో తిరుగుతానని తెలిపింది. నా శరీరానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ బికినీ వేసుకున్నానని తెలిపింది’’ అని అన్నారు. అయితే, ఆమెను తాము క్షమించబోమని బేలాన్ అన్నారు. ఆమె తమ దేశ సాంప్రదాయాలను అగౌరవ పరిచిందన్నారు. ఇందుకు రూ.3,453 జరిమానా విధించామన్నారు.

అయితే, ఫిలిప్పీన్స్ బీచ్‌లో వస్త్రధారణ మీద ఎలాంటి నిబంధన లేదని బేలాన్ అన్నారు. అయితే, ఆమె వేసుకున్న బికినీ మరీ సన్నగా ఉండటం.. శరీరంలోని రహస్య భాగాలు కూడా బయటకు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆమె బికినీ వేసుకున్నా.. నగ్నంగా తిరుగుతున్నట్లే కనిపించిందని తెలిపారు. ఫిలిప్పీన్స్‌కు వచ్చే విదేశీ సందర్శకులను తాము ఎంతో గౌరవిస్తామని, వారు కూడా తమ సాంప్రదాయాలను గౌరవిస్తే సంతోషిస్తామన్నారు. బయటి దేశాలకు వచ్చేప్పుడు అలాంటి బికినీలు ధరించకూడదనే కనీసం జ్ఞానం సందర్శకులకు కూడా ఉండాలన్నారు.
Please Read Disclaimer