డిసెంబర్ 31లోపు ఆ పని పూర్తి చేస్తే రూ.5000 ఆదా.. వారికి మాత్రమే!

0

డిసెంబర్ నెల చివరకు వచ్చేశాం. ఇంకోక వారం రోజులుపోతే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. డిసెంబర్ 31లోపు ఒక పని పూర్తి చేస్తే రూ.5,000 మిగుల్చుకునే అవకాశం అందుబాటులో ఉంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం కొందరికే. అది కూడా ఐటీఆర్ ఫైలింగ్ మిస్ చేసుకున్న వారికే ఈ ఛాన్స్ ఉంది.

ఆగస్ట్ 31తో గడువు పూర్తి

2019-20 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు 2019 ఆగస్ట్ 31తో గడువు పూర్తియ్యింది. ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును జూలై 31 నుంచి ఆగస్ట్ 31కి పొడిగించిన విషయం తెలిసిందే. ఎవరైతే ఆగస్ట్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేదో వారికి పెనాల్టీ పడుతుంది.

డిసెంబర్ 31 లోపు

ఆగస్ట్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయని వారు ఇప్పుడు డిసెంరబర్ 31లోపు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలంటే రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,000 చెల్లించడం ఎందుకులే అని భావించి డిసెంబర్ 31లోపు ఐటీఆర్ సమర్పించకపోతే అప్పడు పెనాల్టీ డబుల్ అవుతుంది.

రూ.10,000 పెనాల్టీ

డిసెంబర్ 31 తర్వాత 2020 మార్చి 31లోపు ఐటీఆర్ దాఖలు చేస్తే అప్పుడు రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. అందువల్ల ఆగస్ట్‌లో ఐటీఆర్ దాఖలు చేయకపోతే.. ఇప్పుడైనా వెంటనే ఆ పని పూర్తి చేయండి. డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి చేయకపోతే అప్పుడు రూ.5,000 కాకుండా రూ.10,000 పోగొట్టుకోవలసి వస్తుంది.

కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి

ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ట్యాక్సబుల్ ఇన్‌కమ్ కలిగిన వారు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ట్యాక్సబుల్ ఇన్‌కమ్ కలిగిన వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయాలి.

వాలంటరీ ఐటీఆర్ దాఖలుకు వర్తించదు

కొంత మంది ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్లు వాలంటరీగా ఐటీఆర్ దాఖలు చేస్తుంటారు. ఇలాంటి వారు గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఎలాంటి పెనాల్టీలు పడవు. అలాగే అసెసీ మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉంటే అప్పుడు పెనాల్టీ రూ.1,000 మించకూడదు.
Please Read Disclaimer