హైదరాబాద్‌లో కామపిశాచి.. పోర్న్ చిత్రాలు చూపిస్తూ బాలికలపై అఘాయిత్యం

0

సెల్‌ఫోన్లో పోర్న్ చిత్రాలు చూపిస్తూ బాలికలను లొంగదీసుకునేందుకు యత్నించిన కామపిశాచిని హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బండ్లగూడ గౌస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సల్మాన్‌(22) వృత్తిరీత్యా మేస్త్రీ. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్లో పోర్న్ చిత్రాలు చూడటానికి అలవాటు పడిన అతడు కామంతో రెచ్చిపోయాడు. తన కోరికలు తీర్చుకునేందుకు సల్మాన్‌ గౌస్‌నగర్‌ వీకర్ సెక్షన్ కాలనీలోని మైనర్ బాలికలపై కన్నేశాడు.

బాలికలను మచ్చిక చేసుకుని సెల్‌ఫోన్లో మ్యాజిక్‌ ట్రిక్స్‌ చూపిస్తానంటూ నమ్మించాడు. ఒక్కోసారి ఒక్కొక్కరిని నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారి పోర్న్ చిత్రాలు చూపిస్తూ అలా చేద్దామంటూ ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో బాలికలు భయపడి పారిపోయేవారు. ఇలా ఐదుగురు బాలికలపై ఆ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. కొద్దిరోజులు కొనసాగుతున్న ఈ తంతు గురించి తెలుసుకున్న స్థానికులు అబ్దుల్‌ సల్మాన్‌ను శనివారం నిలదీశారు.

అతడిపై చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లో అనేక పోర్న్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌ హెచ్చరించారు.
Please Read Disclaimer