హైదరాబాద్‌లో మోడల్‌పై గ్యాంగ్ రేప్.. పోలీసులపై ఆరోపణలు

0

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్‌లో ఈ ఘటన జరగ్గా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మిస్‌ మోడల్‌ కాంటెస్ట్‌కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపైన ఇద్దరు యువకులు పైశాచికంగా దాడి చేశారు. ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా.. మరొకడు ఆ దారుణాన్ని సెల్‌ఫోన్లో రికార్డ్ చేశాడు.

ఈ ఘటనకు సంబంధించి గత నెల 28న బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు చాలా ఆలస్యంగా జనవరి 7న ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు తీసుకున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు శుక్రవారం మీడియా ముందుకొచ్చింది. ఇద్దరు యువకులు తనను నమ్మించి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. పోలీసులు ఈ కేసును నీరు గార్చేందుకు యత్నిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె ఆరోపణలపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Please Read Disclaimer