మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు ‘విజయలక్ష్మి’ గారు!

0

క్రికెట్ కి భారత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ టీ 20 వన్డే టెస్ట్ రంజీ ఇలా ఏ మ్యాచ్ అయినా కూడా అభిమానులు చాలా ఉత్సహంగా చూస్తుంటారు. అలాగే ఎంతోమంది గల్లీ క్రికెటర్ గా కెరియర్ మొదలుపెట్టి దేశం కోసం ఆడే వరకు ఎదిగారు..స్టార్స్ గా మారారు. అటువంటి వారిలో ఒకరు హనుమ విహారి. ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో ఉంది. ఇందులో భాగంగా మూడో టెస్ట్ లో ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి మూడో టెస్ట్ లో అద్భుతమైన టెస్ట్ ఆట తీరుతో జట్టుని ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు విజ్రుంభిస్తున్న వేళ వారిని ఎదుర్కొంటూ చక్కగా నిలబడ్డాడు. దీనితో ఇండియా ఓటమి నుండి బయటపడి డ్రా గా మ్యాచ్ ను ముగించింది.

దీనితో హనుమ విహారి తల్లిని ఉద్దేశిస్తూ.. క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తెలుగులో ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ భాషలో లో ఉన్నా స్పష్టమైన తెలుగులో ‘విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు’ అంటూ ట్విట్ చేశాడు. ఆ ట్వీట్ రెండు గంటల్లోనే 8వేల రీట్వీట్లు 54వేల లైకులు పొందింది. అతని ఆట చూసిన హర్షా బోగ్లె ` విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

నేడు సిడ్నీ టెస్ట్ చివరి రోజు లో భాగంగా ..మ్యాచ్ ఓటమి పాలు కాకుండా హనుమ విహారి అశ్విన్ జోడీ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. 258 బంతులు ఆడి 62 పరుగులే చేసినా… ఓటమి బారి నుంచి కాపాడింది. నాలుగు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సందర్భంగా ఈ జోడీపై భారత క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా హర్షా భోగ్లే ట్వీట్ చేశారు. హైదరాబాదీ అయిన హర్ష.. తెలుగులో ట్వీట్ చేయడంతో తెలుగు ప్రజలతో పాటుగా దేశంలోని క్రికెట్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు.