జగన్ గారూ.. అమరావతిలో ఇంటి అద్దె లక్ష రూపాయలా?

0

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇంటి అద్దె ఎక్కువనే సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కంటే ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉన్నాయంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోన్న నగరంలో.. అద్దెలు ఈ స్థాయిలో ఉంటే సామాన్యుడు బతికేదెలా అనే ప్రశ్నలూ ఉత్పన్నం అయ్యాయి. రాజధానిలో అద్దెలు ఎక్కువనే సంగతి తెలుసు కానీ.. ఏకంగా లక్ష రూపాయలకు చేరాయా అని ఆశ్చర్యపోయేలా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసం కోసం నెలకు లక్ష రూపాయల చొప్పున అద్దె కోసం సర్కారు జీవో విడుదల చేసింది.

కాపు రామచంద్రా రెడ్డికి కుంచెనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో 101, 102 నంబర్ ఫ్లాట్లలో నివాసం ఉండటం కోసం.. అద్దె నిమిత్తం ప్రతినెలా లక్ష రూపాయలను రిలీజ్ చేస్తూ ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. ఆయన క్యాంప్ ఆఫీస్‌కు కూడా రూ.5 వేల చొప్పున అలవెన్స్ చెల్లిస్తున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. జూన్ 12 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

అద్దె కోసం లక్ష రూపాయలు చెల్లిస్తారా? అని ప్రశ్నిస్తూ ఈ జీవోను టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కుంచెనపల్లిలో రెండు ఫ్లాట్లకు లక్షరూపాయల రెంట్ కేవలం వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే సాధ్యమంటూ టీడీపీ నేతలు కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం కూడా దీనికి కౌంటర్ ఇస్తోంది. టీడీపీ హయాంలో కూడా విప్‌లకు ఇంటి నిమిత్తం ఇదే విధంగా లక్ష రూపాయలు అద్దె చెల్లిచారని చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు.
Please Read Disclaimer