జగన్ డెసిషన్ తో షాక్ లో తెలంగాణ

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంతో పాటు సింగరేణి సంస్థకు ఏకపక్షంగా షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కేసీఆర్ ను ఈ విషయంలో పట్టించుకోనట్టే కనపడుతోంది. ఏపీహెచ్ ఎంఈఎల్ సింగరేని కాలరీస్ లిమిటెడ్ కు చెందిన సంస్థ. ఇది కృష్ణా జిల్లాలోని విజయవాడకు సమీపంలో ఉంది. ఇది సింగరేణి ఉపయోగించే యంత్రాలను తయారు చేస్తుంది.

ఇక సింగరేణి కాలరీస్ లో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఉంది. ఇక సింగరేని కాలరీస్ కు ఏపీహెచ్ ఎంఈఎల్ లో 84 శాతం వాటా ఉంది. ఇక ఇది ఏపీ భూభాగంలో ఉండడంతో ఏపీకే చెందేలా జగన్ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సింగరేణి కాలరీస్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ మాత్రం ఏపీహెచ్ ఎంఈఎల్ ఏపీలో ఉన్నట్టు స్పష్టం చేసింది. ఏపీహెచ్ ఎంఈఎల్ కు ఆస్తులు మరియు 600 కోట్ల రూపాయల విలువైన స్థలాలు కూడా ఉన్నాయి.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు సింగరేణి అధికారులు షాక్ గురయ్యారు. ఏపీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ ఆస్తులు సింగరేణికి చెందినవి అని.. జగన్ తో మాట్లాడి ఆ జీవో ఉపసంహరించుకునేలా చేయాలని సింగరేణి అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్ సైతం జగన్ తో తాను మాట్లాడి ఈ విషయాన్ని సామరస్యపూర్తకంగా పరిష్కరించేలా చేస్తానని వారికి చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ జగన్ తో మాట్లాడిన తర్వాతే ఏపీహెచ్ ఎంఈఎల్ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో సింగరేణి అధికారులు ఆలోచన చేయనున్నారు. ఇరు ముఖ్యమంత్రులు అన్ని విషయాల్లో వివాద రహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జీవో రావడం ఆశ్చర్యకరమే. మరి తర్వాత జగన్ జీవోను ఉపసంహరించుకుంటారా? కేసీఆర్ వినతిని మన్నిస్తారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer