Templates by BIGtheme NET
Home >> Telugu News >> జగన్ భీకర ప్రకటనలు..! టైమింగ్ మిస్..!

జగన్ భీకర ప్రకటనలు..! టైమింగ్ మిస్..!


ఏదైనా సరైన సమయంలో చేస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే.. అతి వికటించే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఆ సమయాన్ని మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ భీకరంగా స్పందిస్తున్నారు. ఎవర్నీ వదలొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంకా చాలా చాలా చెబుతున్నారు. అవన్నీ ఇంకా సీరియస్‌గా ఉన్నాయి. కానీ… పరిస్థితి చూస్తే ఇప్పటికే కట్టుదాటిపోయినట్లుగాకనిపిస్తోంది. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం అయిపోయింది. ఒక్కో పార్టీ రంగంలోకి దిగుతోంది.

ఆలయాల అంశం అత్యంత సున్నితమైనదని.. రాజకీయ ప్రాధాన్యత కలదని… తెలియని రాజకీయ నేత ఉండరు. జగన్ కు కూడా ఈ విషయం మరింత స్పష్టత ఉండి ఉంటుంది. అయితే.. ఆయన ఏం చేశారు..?. తన హయాంలో.. ఇలాంటివి జరిగితే.. మరింత ఎక్కువ ప్రచారం వస్తుందని కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే.. ఆయన స్వయంగా క్రీస్తును నమ్ముతారు. తాను క్రిస్టియన్. ఆ విషయంలో ఎవరికీ పట్టింపు లేదు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. అయితే క్రిస్టియన్ సీఎం స్థానంలో ఉన్నప్పుడు… మత రాజకీయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఆయన గుర్తించాల్సి ఉంది. కానీ.. మొదటి నుంచి ఆలయాలపై దాడుల వ్యవహారాంలో నిర్లక్ష్యమే కనిప్తోంది. వ్యక్తిగతంగా కేర్ తీసుకుని.. ఆలయాలకు రక్షణ వ్యవహారాలు చూడాల్సింది. కానీ.. వాటి గురించి తాము పట్టించుకోవాల్సిందేమున్నట్లుగా ఉన్నారు. ఫలితంగా దాడులు అంతకంతకూ పెరిగిపోయాయి. ఇప్పుడవి దావాలనంలా మారాయి.

బిట్ర గుంటనుంచి రామతీర్థం వరకు… జరిగిన ఘటనలు లెక్కేలేదు. ఇందులో అసలు విశేషం ఏమిటంటే.. ఒక్కరంటే.. ఒక్క నిందితుడ్ని పట్టుకోలేదు. చాలా వరకూ… మతి స్థితిమితం లేని వాళ్ల ఖాతాలో వేశారు. మరికొన్ని వాటన్నింటికీ అవే పడిపోయాయనని చెప్పారు. అవి సంచలనాత్మకం అయినా… ట్రోలింగ్‌కు గురైనా .. సరే… పట్టించుకోలేదు. తాము చెప్పాలనుకున్నదే చెప్పారు. నిందితుల్ని పట్టుకోలేదు. రామతీర్థం విషయంలోనూ అదే చేయబోయారు. మొదట మతిస్థిమితం లేని వారి పని అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు సీఐడీ పోలీసులు వచ్చి పక్కా కుట్ర ప్రకారం జరిగిందనే వాదన వినిపిస్తున్నారు. ఆ విషయం మొదట్లో ఎందుకు గుర్తించలేకపోయారనే విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక

మొదట్లో లైట్ తీసుకున్నారు. ఇప్పుడది పరిష్కరించలేని సమస్యగా మారిపోయింది. ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలి. ఓ చర్చిపై రాళ్లు వేస్తే.. 45 మందిని నిమిషాల్లోనే అరెస్ట్ చేశారు. ఇది వాస్తవం. ఈ లెక్కన చూస్తే గుళ్లపై దాడులు చేసిన వారిని రోజుల్లో అయినా అరెస్ట్ చేయాలి. పోలీసులు అంత వట్టి పోలేదు. పట్టుకోగలరు కూడా. ఇప్పటికైనా సీఎం.. ఎవర్నీ వదలొద్దని చెబుతున్నారు. అంతే కాదు ఇక ముందు ఒక్కటంటే.. ఒక్క ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే.. ప్రభుత్వంపైనే అనుమానాలు పెరిగిపోతాయి.