నెక్ట్స్ అలీనే.. జగన్ ఏం చేయబోతున్నారు?

0

చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజులవీ.. ఎన్నికల వేళ ప్రతిపక్ష వైసీపీకి అండగా కదిలివచ్చారు కొందరు సినీ ప్రముఖులు. టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబు వెంట ఉంటే.. ఫృథ్వీ – అలీ – జీవిత రాజశేఖర్ – పోసాని లాంటి కొందరు మాత్రం జగన్ సీఎం కావాలని పాటుపడి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు..

ఇక కమెడియన్ అలీ ఎన్నికలకు నెల రోజుల ముందు జగన్ కు జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరుతానని ప్రకటించి కొంత ఇబ్బంది పడ్డారు అలీ. అయితే పదవి కోసమే పాలిటిక్స్ అన్న విమర్శలు వచ్చాయి. కానీ చివరకు ఎక్కడ చెడిందో కానీ బాబు – జగన్ ను కలిసి చివరకు వైసీపీలోనే చేరారు.

అయితే అలీ ఎమ్మెల్యే టికెట్ హామీపైనే వైసీపీలో చేరినా లాస్ట్ మినట్ లో జగన్ ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారట.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టులపై జగన్ దృష్టిసారించారు. కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని జగన్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి..

ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు కోసం పాటుపడ్డ అలీ ఇప్పుడు వైసీపీ పెద్దలను తన సంగతేంటని సుతిమెత్తగా కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయినా లేదా ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా ఇస్తారా అన్న కోణంలో ఎదురుచూస్తున్నాడట.. మరీ ఫృథ్వీని కరుణించిన జగన్.. అలీపై ఎప్పుడు దృష్టిసారిస్తాడనేది వేచిచూడాలి.
Please Read Disclaimer