వైఎస్ వివేకా హత్య కేసులో బయటకు సంచలన నిజాలు?

0

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య పూర్తిగా సుపారీ హత్యగా పోలీసులు భావిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివేకాను ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.

వివేక హత్య కేసులో ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వివేకాను ఎవరో డబ్బులు ఇచ్చి మరీ చంపించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 800 మందిని విచారించిన తర్వాత సునీల్ గ్యాంగ్ కిరాతకం తెర మీదకు వచ్చింది. నిందితులు వాడిన బైక్ ఆధారంగా కేసును పోలీసులు ఒక కొలిక్కి తెచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానస్పద స్థితిలో మరణించటంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ గ్యాంగ్ వివేక హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన బైక్ ను శ్రీనివాసరెడ్డే సమకూర్చినట్లుగా భావిస్తున్నారు. అతడి వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
Please Read Disclaimer