వివేక హత్య కేసులో వార్తలన్ని అబద్ధాలేనట!

0

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తల సారాంశం.. వివేకా హత్యలో సునీల్ గ్యాంగ్ పాత్ర ఉందన్నది ఝూడీ అయినట్లుగా వచ్చాయి. అయితే.. అవన్నీ ఉత్త అసత్యాలే తప్పించి నిజాలు కావని చెబుతున్నారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజాలు లేవని.. ఎవరూ వాటిని నమ్మొద్దని పేర్కొంటున్నారు. ఒకవేళ.. ఎవరైనా అసత్య సమాచారాన్ని ప్రచారం చేసిన పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ హస్తం ఉందన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. అవన్నీ పూర్తిగా అవాస్తవంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. సో.. బిగ్ బ్రేకింగ్ గా మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ హస్తం.. అంతా అబద్ధమని తాజా క్లారిటీతో తేలిందని చెప్పాలి.
Please Read Disclaimer