ఇంట గెలవక రచ్చ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు!

0

పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారింది ఆ వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. మీడియా మైకుల ముందు.. చర్చల్లో – బయటా ఊదరగొట్టే ప్రసంగాలతో ఫోకస్ అవుతున్న వీరు వైసీపీ ఇంత అఖండ మెజార్టీలో.. వైసీపీ ఫ్యాన్ గాలి ఏపీ వ్యాప్తంగా వీచినా గెలవకపోవడం విశేషం. ఇంత ఊపులో గెలవని ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అలాంటి ఓడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆధిపత్యం చెలాయించడం వైసీపీలో మిగతా నేతలను కలవరపెడుతోంది. తాజాగా ఇప్పుడు వైసీపీ ఓడిన అభ్యర్థులు తమపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ.. వారిపై కేసులున్నా అఫిడవిట్ లో దాచేశారని నానా యాగీ చేస్తున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత చిన్నరాజప్ప చేతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటవాణి పెద్ద పురం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఇంత వైసీపీ ఊపులో కూడా ఈమె గెలవకపోవడం ఈమెపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు గెలవడం చేతకాని ఆమె టీడీపీ ఎమ్మెల్యేల లూప్ హోల్స్ వెతికి ఎమ్మెల్యేగా కోర్టుల ద్వారా గెలవాలని చూస్తోంది.

ఇక చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం చేతిలో ఓడిపోయారు ఆమంచి కృష్ణమోహన్. వైసీపీ ఇంత గాలిలో కూడా ఈయన గెలవకపోవడం నివ్వెరపరిచింది. ఇప్పుడు సొంతంగా గెలవలేని వీరిద్దరూ టీడీపీ ఎమ్మెల్యేలపై లూప్ హోల్స్ వెతికి కోర్టుల ద్వారా గెలవాలనుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరూ అంత ఊపులో గెలవలేదని.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల తప్పులు తీసి గెలవాలనుకోవడంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అడ్డదారుల్లో గెలుపు గెలుపుకాదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలా తప్పుడు మార్గంలో గెలవడం వైసీపీకి కూడా మంచిది కాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
Please Read Disclaimer